హ్యుందాయ్ క్రీటా గురించి మీరు తప్పనిసరిగా తెలుసుకోవలసిన 5 విషయాలు

published on ஜூன் 05, 2015 02:33 pm by raunak

హ్యుందాయ్ ఇండియా మొట్టమొదటి సారిగా కాంపాక్ట్ ఎస్యువి ని ప్రవేశపెట్టడానికి సిద్దమౌతున్నారు. కొరియన్ తయారీదారులచే కొత్తగా ప్రవేశపెట్టబడుతున్న ఈ కాంపాక్ట్ ఎస్యువి చూడటానికి చాలా ఆకర్షణీయంగా రాబోతుంది.  

హ్యుందాయ్ లో రాబోయే కాంపాక్ట్ ఎస్యువి యొక్క పేరు 'క్రీటా' గా నామకరణాన్ని అధికారికంగా వెల్లడించింది. హ్యుందాయ్ పరంగా చెప్పాలంటే, క్రీటా యొక్క ఉచ్చారణ క్రియేటివ్ పదంతో స్వాగతం పలికే విధంగా ఉంటుంది. ఈ వాహనాన్ని మొట్టమొదటి సారిగా చైనా లో ప్రవేశపెట్టారు. చైనా లో ఈ వాహనాన్ని ఐఎక్స్25 అని పిలిచేవారు. కానీ భారతదేశం మరియు మిగిలిన ప్రపంచ మార్కెట్ లలో క్రీటా గా పిలవబడుతుంది. ఈ వాహనం, భారతదేశంలో ఎస్యువి లకు మరియు క్రాస్ ఓవర్ లకు పోటీగా రానుంది. ఎస్యువి లు క్రాస్ ఓవర్లు అయిన రెనాల్ట్ డస్టర్, నిస్సాన్ టెర్రినో, మహీంద్రా స్కార్పియో, టాటా సఫారి స్టోర్మ్ తో పాటు ఫోర్డ్ ఈకోస్పోర్ట్, మరియు రాబోయే మారుతి సుజుకి యొక్క క్రాస్ వంటి వాటికి ఈ క్రీటా పోటాగా రానుంది. రాబోయే హ్యుందాయ్ క్రీటా గురించి ఐదు ఆసక్తికరమైన నిజాలు చూద్దాం రండి; దీనిని జూలై నెలలో ప్రవేశపెట్టడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దీని యొక్క ధర రెనాల్ట్ డస్టర్ పరిధిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే, 8-13 లక్షలు మధ్య అని అర్థం.

ఒక బేబీ సాంట ఫీ లాగా కన్పిస్తోంది

సాంట ఫీ వాహనానికి పోటీ దారులైన ఆడి క్యూ3 మరియు బిఎండబ్ల్యూ ఎక్స్1 లకు గట్టి పోటీను ఇస్తుంది. ఈ వాహనాల యొక్క ధరలు కూడా సుమారుగా ఒకే విధంగా ఉంటాయి. ఇప్పుడు, క్రీటా చూడటానికి బేబి సాంట ఫీ లా కనిపిస్తుంది. సాంట ఫీ డిజైన్ మరియు హ్యుందాయ్ ఫ్యూడిక్ వెర్నా డిజైన్ లు ఒకే విధంగా ఉంటాయి. మరియు క్రీటా నిస్సందేహంగా చాలా ఆడంబరం ఉంటుంది.  

   

ఈ క్రీటా రోడ్ పై ఉన్నప్పుడు ముఖ్యంగా చూడవలసిన అంశాలు వరుసగా,  ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ తో పాటు డేటైమ్ రన్నింగ్ ఎలీడి లను మరియు డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటి వాటిని ముఖ్యంగా గమనించాలి. ఇంకా, ఇది ఆల్రౌండ్ బాడి క్లాడింగ్, బ్లాక్డ్ ఔట్ పిల్లర్ మరియు రాప్ అరౌండ్ టైల్ ల్యాంప్స్ వంటి వాటిని కలిగి ఉంటుంది.

హ్యుందాయ్ వెర్నా లో ఉండే అదే ఇంజెన్ క్రీటా లో

హ్యుందాయ్ లో అనేక ధరల పరిది ఉంటుంది. అంతేకాకుండా హ్యుందాయ్ బహుళ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఈ క్రీటా ఎస్యువి కు వెర్నా కు ఉండే అదే ఇంజెన్ ను దీనికి అమరుస్తారు. వెర్నా లో 1.4 పెట్రోల్ మరియు డీజిల్ ఇంజెన్లు అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా 1.6 పెట్రోల్ మరియు డీజిల్ ఇంజెన్లు అందుబాతులో ఉన్నాయి. ఈ హ్యుందాయ్ క్రీటా కు అత్యంత శక్తివంతమైన ఇంజెన్ అమర్చవలసి ఉంది. అందుచేత, వెర్నా నుండి 1.6 పెట్రోల్ ఇంజెన్ అమర్చే అవకాశాలు చాలా ఉన్నాయి అంటున్నారు. ఎందుచేతనంటే, ఈ 1.6 పెట్రోల్ ఇంజెన్ 120bhp కు పైగా పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా అత్యధికంగా 260Nm గల టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 

హ్యుందాయ్ లో బ్లూ లింక్ సమాచార వ్యవస్థ 

హ్యుందాయ్ లో బ్లూ లింక్ సమాచార వ్యవస్థ ను చైనా లో ప్రవేశపెట్టబడిన క్రీటా లో మనం చూడవచ్చు. చైనా లో ప్రవేశపెట్టబడిన క్రీటా లో ఉండే పెద్ద టచ్ స్క్రీన్ యూనిట్ వంటి ఫీచర్లతో పాటు ఇంకా కొన్ని లక్షణాలతో భారతదేశంలో కి రాబోతుంది. ఈ రాబోయే క్రీటా లో పెద్ద టచ్ స్క్రీన్ వ్యవస్థ, నావిగేషన్ స్య్స్టం తో పాటు మొబైల్ ఆప్ ద్వారా స్మార్ట్ఫోన్ ఇంటిగ్రేషన్ వంటి లక్షణాలతో రాబోతుంది.

ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలు మరియు ఏడబ్ల్యూడి

చైనా లో ప్రవేశపెట్టబడిన క్రీటా లో 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అందించబడుతుంది మరియు హ్యుందాయ్, భారతదేశంలో అదే ట్రాన్స్మిషన్ తో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాక, ఈ రాబోయే క్రీటా లో  ఆల్ వీల్ డ్రైవ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే, క్రీటా తో పోటీ పడే చాలా కార్ల లో ఏడబ్ల్యూడి లేదా 4డబ్ల్యూడి లతోనే వస్థున్నాయి. రాబోయే మారుతి సుజుకి ఎస్ క్రాస్ విషయానికి వస్తే, దానిలో కూడా ఏడబ్ల్యూడి తో రాబోతుంది. హ్యుందాయ్ కూడా భారతదేశంలో అదే ఏడబ్ల్యూడి తో వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి.  రాబోయో క్రీటా లో 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ వెర్షన్ లో మరియు 5-స్పీడ్ మాన్యువల్ ట్రన్స్మిషన్ పెట్రోల్ వేరియంట్ లతో రాబోతున్నాయి. 

క్రీటా పొడవు 4 మీటర్లకు తక్కువ కాకుండా రాబోతుంది

రాబోయే క్రీటా 4 మీటర్లకు తక్కువ కాకుండా రాబోతుంది, ఈ 4 మీటర్లను (4000మిల్లిమీటర్లు) ఫోర్డ్ ఈకోస్పోర్ట్ లో చూడవచ్చు. క్రీటా యొక్క పొడవు 4270 మిల్లీమీటర్లు (దాదాపు 4.2 మీటర్లు). రెనాల్ట్ డస్టర్ పోలిస్తే డస్టర్ 4315 మ్మ్ (4.3 మీటర్లు), దీని కంటే కొంచెం చిన్నదిగా ఉంటుంది. అంతేకాక క్రీటా యొక్క వీల్బేస్ విషయానిక్లి వస్తే, 2590 మిల్లీమీటర్లు. దీనితో పోలిస్తే, ఈకోస్పోర్ట్ 2520మిల్లీమీటర్లు కొంచెం తక్కువ. కాని, డస్టర్ ను క్రీటా తో పోలిస్తే, 2673 మిల్లీమీటర్లు. అంటే కొంచెం ఎక్కువ. ఈ క్రీటా ను, డస్టర్ తో పోలిస్తే తక్కువ నిర్దేశాలను కలిగి ఉంటుంది. కాని ఈ రాబోయే క్రీటా లో విశాలంగా అయిదుగురు కూర్చునే అవకాశాన్ని తయారీదారుడు కల్పిస్తున్నాడు. మరియు ఈ క్రీటా యొక్క బూట్ వైశాల్యం దగ్గరగా 400 లీటర్లు. 

வெளியிட்டவர்
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your கருத்தை

Read Full News

கார் செய்திகள்

  • டிரெண்டிங்கில் செய்திகள்
  • சமீபத்தில் செய்திகள்

trendingகார்கள்

  • லேட்டஸ்ட்
  • உபகமிங்
  • பிரபலமானவை
×
We need your சிட்டி to customize your experience